పుల్లట్లు


కావలసిన  పదార్ధాలు : 
     పుల్లటిమజ్జిగ: 3 కప్పులు, 
    బియ్యం: కప్పు, 
    మెంతులు: 2 టీస్పూన్లు, 
    జీలకర్ర: స్పూను, 
   పచ్చిమిరపకాయలు: ఆరు, 
   ఉప్పు: తగినంత,  నూనె
తయారుచేసే విధానం:-
      మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మెత్తగా రుబ్బుకోవాలి.
      పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.. దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి.
      పెనంమీద కొద్దిగా నూనె రాసి పిండితో దోసె వేసి రెండువైపులా కాల్చి తియ్యాలి.

0 comments:

Post a Comment