కావలసిన పదార్ధాలు :
బియ్యంపిండి: ఒక కప్పు, జీలకర్ర: కొద్దిగా,
మైదా: అరకప్పు, ఉప్పు: తగినంత,
కొబ్బరి చిప్ప: సగం, నీళ్ళు: ఒకటిన్నర కప్పులు
పచ్చిమిరపకాయలు: ఆరు, నూనె
తయారుచేసేవిధానం:-
ముందుగా కొబ్బరి తురిమి ఉంచాలి. మైదా, బియ్యంపిండి కొబ్బరి తురుముతో కలపాలి.అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి స్టవ్‌మీద పెట్టాలి.
పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్ చేసి నీళ్లలో వెయ్యాలి.
నీళ్ళు మరిగిన తరవాత ఒక స్పూను నూనె వేసి పిండి పోసి బాగా కలిపి దించాలి.
చల్లారిన తరవాత కొద్దిగా నూనె రాసి నిమ్మకాయంత పిండి తీసుకుని, గుండ్రంగా వత్తి ఎర్రగా కాగిన నూనెలో వేయించి తియ్యాలి.
ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి

0 comments:
Post a Comment