ఎప్పుడూ ఒకే విధం గా చేస్తే చపాతీ బోర్ గా ఉంటుంది తినాలి అంతే,,దానిలో ఇంక ఏదైనా కలిపితే కాస్త తస్తే,బలం ఉంటుంది అని ఇలాగ ట్రై చేశాను,,
కావలసిన పదార్ధాలు;
గోధుమ పిండి-1 కప్
కార్రోట్ తురుము-1 కప్
వాటర్
విధానము:
చెప్పెదేముందండి,చపాతీ కలపటం వచ్చుకదా మన అందరికి అలాగే ఇది కూడాను,గోధుమ పిండి లో ఈ కార్రోట్ తురుము,కొంచెం నూనె,కొంచెం వాటర్ వేసి పిండి బాగా కలపాలి.ఒక గంట అన్నా నాననివ్వాలి..తర్వాత కొంచెం తక్కువ మంటలో చపాతీలు కాల్చాలి..ఎందుకంటే మరీ పచ్చి గా అనిపిస్తుంది కార్రోట్,,
కూర లేకపోయినా ఇట్లాగైన లాగించేయవచ్చు,పిల్లలకు మంచి ఆహరం..
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment