మా బాబు కు లడ్డులంటే భలే ఇష్టం గా తింటాడు,,పాకం తో చేసేవి ఎందుకులే అని కొత్తగా ఉంటుంది అని సున్నిఉండల లాగా ఇది చేసి పెట్టాను,,taste బాగుంటుంది.ఇష్టం గా తిన్నారు ఇంట్లో అందరూ,,చేయటం కూడా సులభమే,,మీరు ట్రై చెయ్యండి..
కావలసిన పదార్ధాలు:
పెసర పప్పు--1 కప్
పంచదార- 1 కప్
నెయ్యి-2spoon
ఎలాచి -5
జీడి పప్పు,కిస్మిస్ కొద్దిగా
విధానము:
ముందు గా పెసరపప్పు ను బాండి లో వేసి వేయించాలి.మరీ ఎర్రగా కాకుండా కొంచెం గా వేయించాలి.
పంచదార,ఎలాచి లను mixi లో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
పెసరపప్పు ను కూడా mixie లో వేసి బరక గా పొడి చేయాలి.
పంచదార పొడి,పెసర పొడి కలిపి అందులో నెయ్యి లో వేయించిన జీడిపప్పు,కిస్మిస్ వేసి మిగిలిన నెయ్యి ను కూడా వేసి లడ్డు లాగా చుట్టాలి.
అంతే తియ్య తియ్యని లడ్డు రెడీ..
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను మంజు గారు. అరగంట లొ వంట, టైటిల్ బావుంది.
ఏదైనా ప్రత్యెక సందర్భంలొ తప్ప నాక్కూడా వంటింట్లొ అరగంటకి మించి గడపడం నచ్చదు.
మీరు ఇచ్చిన రెసిపీలు అన్ని ఇప్పుడు తీరిగ్గా చదువుకుంటా :)
Post a Comment