లడ్డు

 పూరీలు చేసినప్పుడు దాదాపు మిగులుతూనే ఉంటాయి..చల్లారినాక  తినాలి అంటే ఎవరూ తినరు..అందుకని మిగిలినవాటిని ఒక్కసారి నూనెలో వేయించి తీస్తే కరకర లాడుతూ వస్తాయి  ....అలాంటివాటిని varitey గ లడ్డు లాగా చేసుకుంటే నిమిషం లో లాగించేయొచ్చు  ...
కావలసినవి:
పూరీల పొడి... 3 గ్లాసులు
పంచదార పొడి... 6 గ్లాసులు
పుట్నాలపొడి... గ్లాసు
కరిగించిన నెయ్యి... గ్లాసు
జీడిపప్పు... 100గ్రా
యాలకుల పొడి... 2 టీస్పూన్లు
విధానము:
పూరీలను  మెత్తగా పొడి చేసి, అందులో పుట్నాలపొడి, పంచదార పొడి, యాలకుల పొడి ఒక పాత్రలో వేసి బాగా కలపాలి.
దాంట్లో నెయ్యి వేస్తూ బాగా ముద్దగా కలపాలి.
తరువాత ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టి జీడిపప్పును అద్దితే వెరైటీ పూరీ లడ్డూలు సిద్ధమైనట్లే...!

గోరు మిట్టీలు

కావలసినవి:
మైదా.. రెండు కప్పులు
బొంబాయి రవ్వ.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
నూనె.. వేయించేందుకు సరిపడా
వెన్న.. తగినంత
విధానము:
గిన్నెలో మైదా, రవ్వ, వెన్న వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీల పిండికంటే కాస్త పలుచగా కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని అలాగే 10 నిమిషాలపాటు పక్కనుంచాలి. 
తరువాత ఆ పిండిని తీసి ఓ మోస్తరు ఉండలుగా చేసి, రెండువేళ్ల మధ్యలో ఒక్కో ఉండను ఉంచి నొక్కుతూ పొడవాటి గోళ్లలాగా చేయాలి.
అలా మొత్తం పిండితో చేసుకున్నాక వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార తీసుకుని, కాసిన్ని నీళ్లుపోసి ఉండపాకం వచ్చేలా చూడాలి. 
ఈ పాకాన్ని పైన వేయించి పెట్టుకున్న వాటిపై పోసి బాగా కలియబెట్టాలి.
పాకం చల్లారేకొద్దీ వాటికి గట్టిగా పట్టుకుని తెల్లగా కనిపిస్తుంది. అంతే గోరు మీఠీలు తయార్..

చేగోడీలు


కావలసినవి
              బియ్యపు పిండి - 3గ్లాసులు
              మైదా - 1గ్లాసు
              నెయ్యి - 50గ్రా
              వాము - 1/2టీస్పూను
              పసుపు - 1/4టీస్పూను
              కారం - 1/2టీస్పూను
              ఉప్పు - తగినంత
              నూనె - వేయించడానికి సరిపడినంత
విధానము :
           ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.
           దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.
          ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.
           పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను