మరమరాల ఉండలు

  ఇవ్వాళ mother 's   డే సందర్భం గా నేను చేసిన స్వీట్ మరమరాల ఉండలు,,పాతవంటకమే అయినా తొందరగా చాలా సింపుల్ గా చేసేయొచ్చు..అందులోను మా బాబు ఇష్టం గ తింటాడు అనే ఉద్దేశ్యం తో చేసాను,,నాకు అమ్మ పదవిని ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇది చేసి పెట్టాను వాడికి...

కావలసిన పదార్ధాలు:
               మరమరాలు : ఒక కప్పు
               బెల్లం: ఒక కప్పు

తయారు చేయు విధానము:
           బెల్లంను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉండపాకం అయ్యేలాగా చేయాలి,,,
           (కొంచెం పాకం స్పూన్ లో తీసుకొని నీళ్ళల్లో వేస్తె గట్టిగ అవుతుంది,,),
           అలా ఉండపాకం అవ్వగానే stouve ఆపేసి మరమరాలు వేసి బాగా కలపాలి.
           కొంచం వేడి గా ఉండగానే చిన్న చిన్న ఉండలు గా చేసుకుంటే.,,బాగా చల్లారాక గట్టిగా అవుతుంది...
           తియ్య తియ్య గ ఉండే మరమరాల ఉండలు రెడీ...